కలం, వెబ్ డెస్క్ : తమిళనాడు 17వ స్పీకర్ (Tamil Nadu Speaker) గా టీవీకే పార్టీ సీనియర్ నాయకుడు జేసీడీ ప్రభాకర్ (JCD Prabhakar) ఎన్నికయ్యారు. సీఎం విజయ్, మంత్రులతో కలిసి ఆయన సోమవారం నామినేషన్ దాఖలు చేశారు. పూర్తి మెజారిటీ ఉండడంతో టీవీకే పార్టీ నుంచి ప్రభాకర్ సభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే, ఉపసభాపతిగా కూడా టీవీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యే రవిశంకర్ ను ఎన్నుకున్నారు. అసెంబ్లీలో సీఎం విజయ్ బలనిరూపణకు ముందు జరిగిన స్పీకర్ ఎన్నికతో టీవీకే పార్టీ తొలి టెస్ట్ పాసయింది. ఈ క్రమంలో రేపు (బుధవారం) బలనిరూపణ పరీక్ష జరగనుంది.

