కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) గడువు మళ్లీ పొడిగించింది. ప్రస్తుత గడువు బుధవారంతో ముగియనుండగా.. అభ్యర్థుల సౌకర్యార్థం ఏప్రిల్ 10 వరకు ఈ గడువును పొడిగిస్తున్నట్లు ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు నిరుద్యోగులు తమ వన్ టైమ్ రిజిస్ట్రేషన్ (OTR) వివరాలను సరిచూసుకోవడానికి.. అవసరమైన మార్పులు చేసుకోవడానికి చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
తొలిసారిగా రిజిస్ట్రేషన్ చేసుకునే కొత్త అభ్యర్థులకు ఈ గడువుతో సంబంధం లేదని కమిషన్ అధికారులు తెలిపారు. ఇప్పటికే రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులందరూ తమ వివరాలను ఎడిట్ చేసి, విద్యార్హతలు.. ఇతర ముఖ్యమైన ధృవపత్రాలను (Certificates) వెబ్‌సైట్‌లో తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. నిర్ణీత సమయంలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయని అభ్యర్థులు రాబోయే కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అభ్యర్థులు వెంటనే www.tgpsc.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.

