మద్యం మత్తులో హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు హల్‌చల్..

కలం, మెదక్ బ్యూరో : సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య (Lavanya) మద్యం మత్తులో హల్ చల్ చేసింది. సంగారెడ్డి (Sangareddy) జిల్లా కొండాపూర్ మండ‌లం మల్లెపల్లి గ్రామంలో బైకుపై వెళ్తున్న ఓ వ్యక్తిని కారుతో ఢీ కొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో లావణ్య (Lavanya) డ్రైవింగ్ చేస్తుంది. త‌ర్వాత కూడా నిర్ల‌క్ష్యంగా ఆగకుండా వెళ్ళిపోయే ప్రయత్నం చేయడంతో కారు ముందుకు వెళ్లకుండా మల్లెపల్లి గ్రామస్తులు అడ్డుకున్నారు. వ్య‌క్తిని ఢీ కొట్టినందుకు సారీ చెప్పాలని గ్రామస్థులు కోరారు. అయితే, వారితో దురుసుగా ప్ర‌వ‌ర్తిస్తూ, వాగ్వాదానికి దిగింది.

ఈ వ్యవహారంపై గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులతో కూడా లావణ్య వాగ్వాదానికి దిగింది. ఆమెకు డ్రంక్ అండ్ డ్రైవ్ ప‌రీక్ష నిర్వ‌హించగా పాజిటివ్ వచ్చింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, లావణ్య ప్ర‌యాణిస్తున్న కారును సీజ్ చేసి కొండాపూర్ పోలీస్ స్టేషన్ కి తరలించారు. లావ‌ణ్య మ‌ద్యం మ‌త్తులో ఉంద‌ని, కారులో మద్యం బాటిల్లతో పాటు మరో వ్యక్త ఉన్నాడని మల్లేపల్లి గ్రామస్తులు చెబుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>