కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు టీజీపీఎస్సీ కీలక అప్ డేట్ ఇచ్చింది. వివిధ పోస్టుల భర్తీకి సంబంధించి నిర్వహించే ఎగ్జామ్స్ షెడ్యూల్ (TGPSC Exam Schedule) ను టీజీపీస్సీ విడుదల చేసింది. ఉద్యోగాల భర్తీకి సంబంధించి గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ఆధారంగా ఈ షెడ్యూల్ ను ప్రకటించింది.
టీజీపీఎస్సీ విడుదల చేసిన షెడ్యూల్ (TGPSC Exam Schedule) ఆధారంగా తొలుత తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో అసిస్టెంట్ సైంటిస్ట్ పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. అనలిస్ట్ గ్రేడ్-2 కు సంబంధించిన ఈ పరీక్షను అక్టోబర్ 24వ తేదీన నిర్వహించనుంది. అక్టోబర్ -26న అసిస్టెంట్ ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్ (ఆర్ అండ్ బీ) పరీక్ష జరగనుంది.
ఆర్ అండ్ బీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులకు నవంబర్ 6, 7 తేదీల్లో రెండు రోజుల పాటు టీజీపీఎస్సీ పరీక్ష నిర్వహించనుంది. డిప్యూటీ ఈవో/ గెజిటెడ్ హెడ్ మాస్టర్ గ్రేడ్-1 కు పోస్టులకు నవంబర్ 12, 13 తేదీల్లో పరీక్షలు జరగనున్నాయి.
టీజీపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షలు సీబీటీ విధానంలో నిర్వహించనున్నట్లు కమిషన్ సూచించింది. పై ఎగ్జామ్స్ కు సంబంధించి హాల్ టికెట్లు, పరీక్ష కేంద్రాల సమాచారాన్ని త్వరలోనే బోర్డ్ అధికారిక వెబ్ సైట్ లో అందుబాటులోకి రానున్నాయి.

