కలం, వెబ్ డెస్క్: హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించడం సినీ ఇండస్ట్రీలో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ముంబయిలోని ఆమె ఇల్లు, ఆఫీస్‌తో పాటు 12 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఆమె మామ, నిర్మాత వషు భగ్నాని, పనోరమ స్టూడియోస్ (Panorama Studios) కార్యాలయాల్లో కూడా తనిఖీలు చేస్తున్నారు. సినిమా ప్రాజెక్టులకు ఫైనాన్స్, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, విదేశాలకు నిధుల మళ్లింపు, మనీ లాండరింగ్ కోణాల్లో సోదాలు సాగుతున్నాయి. ఐటీ సోదాలపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న కొన్ని చిత్రాలకు సంబంధించి నిధులు అందిస్తున్న కొందరు వ్యక్తుల బ్యాంక్ అకౌంట్లపై ఐటీ శాఖకు అనుమానం రావడంతో లావాదేవీల పత్రాలను పరిశీలిస్తున్నారు. గతంలో రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) డ్రగ్స్ కేసులో హైదరాబాద్ పోలీసులకు దొరికిపోవడం పెద్ద సంచలనంగా మారింది. తాజాగా, రకుల్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతుండటంతో ఇటు టాలీవుడ్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో టాప్ హీరోయిన్గా కొనసాగిన రకుల్.. పెళ్లి తరువాత పూర్తిగా బాలీవుడ్ ఇండస్ట్రీకే పరిమితమైపోయింది.
Also Read : ఆసియా గేమ్స్: పోరాడి రజతం గెలిచిన ఈషా సింగ్!
Follow Us On: Instagram

