టీజీ20 లీగ్ : భారీ రేటుతో మెరిసిన డీజీపీ కుమారుడు!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ క్రికెట్ అభిమానులను అలరించడానికి టీజీ20 లీగ్ (TG20 League) సిద్ధమైంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌కు సంబంధించిన ఆటగాళ్ల వేలంలో రికార్డు స్థాయి ధరలు నమోదయ్యాయి. ఈ వేలంలో అందరి దృష్టిని ఆకర్షిస్తూ, తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ కుమారుడు, యువ క్రికెటర్ సీవీ మిలింద్ (CV Milind) భారీ ధరకు అమ్ముడయ్యారు. ఖమ్మం ఏసెస్ ఫ్రాంచైజ్ ఏకంగా రూ.17 లక్షల సెకండ్ హైఎస్ట్ రికార్డు ధరను చెల్లించి మిలింద్‌ను తమ సొంతం చేసుకుంది. దాంతో ఈ వేలంలో ఆయన టాప్ కాంట్రాక్ట్ సాధించిన ఆటగాళ్లలో ఒకరిగా నిలిచారు.

మరోవైపు, స్టార్ క్రికెటర్ తిలక్ వర్మ ఊహించినట్లుగానే ఈ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడై సరికొత్త రికార్డు సృష్టించారు. మెదక్ ఫాల్కన్స్ ఫ్రాంచైజ్ ఏకంగా రూ. 33 లక్షల అత్యధిక రేటును వెచ్చించి తిలక్ వర్మను జట్టులోకి తెచ్చుకుంది. ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్ల రాకతో ఆయా ఫ్రాంచైజీల్లో సరికొత్త జోష్ నెలకొంది. ఎంతో ఉత్కంఠ రేపుతున్న ఈ టీజీ20 టోర్నీ ఈనెల 21వ తేదీ నుంచి హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఘనంగా ప్రారంభం కానుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ టాలెంట్‌ను వెలికితీసేందుకు ఈ టోర్నమెంట్ ఒక అద్భుతమైన వేదికగా మారబోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>