కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఆధ్వర్యంలో రాష్ట్రంలో సరికొత్త క్రికెట్ పండుగకు తెరలేవనుంది. ఐపీఎల్ నమూనాలో నిర్వహించనున్న టీజీ టీ20 లీగ్ (TG T20 League) లోగోను హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్ వేదికగా ఘనంగా ఆవిష్కరించారు. ఈ టోర్నీ జూన్, జూలై నెలల్లో జరగనుంది. ప్రతిష్టాత్మకమైన ఉప్పల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది.
మొత్తం ఎనిమిది జట్లు ఈ మెగా లీగ్‌లో తలపడనున్నాయి. ఈ ఎనిమిది జట్ల యాజమాన్యం కోసం సుమారు 40 ప్రముఖ కంపెనీలు పోటీ పడుతుండటం విశేషం. ఈ లీగ్ ద్వారా ఎంతోమంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు వెలుగులోకి వస్తారని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఆటగాళ్లలోని నైపుణ్యాన్ని గుర్తించి వారిని సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) ఐపీఎల్ జట్టులోకి తీసుకోవాలని ఆయన కోరారు.

