హ‌రీశ్ రావు కొత్త పార్టీ..? సోష‌ల్ మీడియాలో జోరుగా చ‌ర్చ‌!

క‌లం, వెబ్‌డెస్క్‌: తెలంగాణ (Telangana) రాష్ట్ర రాజ‌కీయాలు రోజురోజుకీ ఆస‌క్తిక‌రంగా మారుతున్నాయి. ఇప్పటికే ఉన్న పార్టీల రాజ‌కీయాల‌కు తోడు కొత్త పార్టీ (New Party)ల‌ ఆవిర్భావం చ‌ర్చ‌కు తెర‌లేపుతోంది. కుటుంబంతో విబేధించి బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన క‌విత టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీ ప్ర‌క‌టించి సంచ‌ల‌నం సృష్టించారు. ఇక ఆ పేరు చుట్టూ ఉన్న వివాదం మాజీ మంత్రి హ‌రీశ్ రావు (Harish Rao) వైపు ట‌ర్న్ అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

టీఆర్ఎస్ (TRS).. ఒక‌ప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మోత మోగిన పేరు. ఇన్నేళ్ల‌కు మ‌ళ్లీ ఆ పేరు తెలంగాణ‌లో హాట్ టాపిక్‌గా మారింది. బీఆర్ఎస్ నుంచి విడిపోయిన క‌విత (Kavitha) తెలంగాణ అస్తిత్వాన్ని ప్ర‌తిబింబించేలా త‌న కొత్త పార్టీకి అదే పేరును ఖ‌రారు చేసి ఎన్నిక‌ల సంఘం అనుమ‌తి కోసం వేచి చూస్తున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాకు చెందిన హ‌రీశ్ రావు ప్ర‌ధాన అనుచ‌రుడు తుపాకుల‌ బాల‌రంగం తెర‌పైకి రావ‌డం ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు దారి తీసింది. హ‌రీశ్ రావు సూచ‌న‌ల మేర‌కు బాల‌రంగం ఇప్ప‌టికే టీఆర్ఎస్ పేరుతో పార్టీ రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభించార‌ని, క‌విత‌కు ఆ పేరును కేటాయించ‌వ‌ద్దంటూ ఎన్నిక‌ల సంఘానికి లేఖ కూడా రాశార‌ని సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

పార్టీలో త‌న‌కు కేటీఆర్ త‌ర్వాతి స్థాన‌మే ల‌భించ‌డం, చాలాకాలంగా బీఆర్ఎస్‌లో త‌గిన ప్రాధాన్య‌త ల‌భించ‌కపోవ‌డం వ‌ల్ల‌ హ‌రీశ్ రావు అసంతృప్తితో ఉన్నార‌ని ఆయ‌న అనుచ‌రుల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఈ నేప‌థ్యంలో హ‌రీశ్ రావు కొత్త పార్టీ పెట్టాల‌ని ర‌హ‌స్యంగా వ్యూహాలు ర‌చిస్తున్నార‌ని, అందులో భాగంగానే టీఆర్ఎస్ పేరును రిజిస్ట‌ర్ చేయించి క‌విత‌కు చెక్ పెట్టాల‌ని చూస్తున్నార‌న్న ఊహాగానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇప్ప‌టికే కేసీఆర్ కుటుంబంలో విబేధాలు రాష్ట్రంలో చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఈ త‌రుణంలో ఒకే పార్టీ పేరు కోసం, ఒకే ఇంటికి చెందిన ఇద్ద‌రు కీల‌క నేత‌లు పోటీ ప‌డ‌టం మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారింది.

సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌లు నిజ‌మైతే తెలంగాణ రాజ‌కీయాల్లో ఇదో కీల‌క మ‌లుపు కానుంది. హ‌రీశ్ రావుకు ఉన్న క్షేత్ర‌స్థాయి బ‌ల‌గానికి టీఆర్ఎస్ వంటి పాత గుర్తింపు తోడైతే ఆయ‌న కొత్త పార్టీ బ‌ల‌మైన రాజ‌కీయ శ‌క్తిగా ఎదిగే అవ‌కాశం ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అంచ‌నా వేస్తున్నారు. అయితే ఇప్ప‌టికే తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీల మ‌ధ్య గ‌ట్టి పోటీ ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు క్షేత్ర‌స్థాయిలో బ‌లంగా ఉన్నాయి. ఈ త‌రుణంలో మ‌రో కొత్త పార్టీ వీటిని త‌ట్టుకొని ఎదుగుతుందా? అంటే క‌ష్ట‌మ‌నే చెప్పాలి. మ‌రి సోష‌ల్ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌ను నిజం చేస్తూ హ‌రీశ్ రావు నిజంగానే సొంత పార్టీ పెడ‌తారా? లేక త‌న‌కున్న ప‌ట్టును నిరూపించుకోవ‌డానికి కొత్త పార్టీ పేరుతో మైండ్ గేమ్ ఆడుతున్నారా? అనేది తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఇప్ప‌టికే క‌విత బీఆర్ఎస్‌ను వీడ‌టంతో పార్టీకి బాగా డ్యామేజ్ అయ్యింది. ఇక హ‌రీశ్ రావు కూడా బీఆర్ఎస్‌ను వ‌దిలితే పార్టీ మ‌నుగ‌డే క‌ష్ట‌మ‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి హ‌రీశ్ రావు కొత్త పార్టీపై వ‌స్తున్న వార్త‌ల్లో ఎంత మేర‌కు నిజ‌ముందో తెలుసుకోవాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>