Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ పీజీ ఈసెట్‌ ఫలితాలు విడుదల

కలం, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ ఇంజినీరింగ్ ఫార్మాసీ, ఆర్కిటెక్చర్ కాలేజీల్లో ఫుల్‌టైం ఎంఈ, ఎంటెక్, ఎంఫార్మాసీ, ఎంఆర్క్, గ్రాడ్యుయేట్ లెవెల్ ఫార్మ్.డి కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన తెలంగాణ పీజీ ఈసెట్ (TG PGECET 2026) ఫలితాలు విడుదలయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఈ ఫలితాలను తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకృష్ణా రెడ్డి రిలీజ్ చేశారు.

ఫలితాలను పీజీ ఈసెట్ అధికారిక వెబ్‌సైట్ pgecet.tgche.ac.in ద్వారా తెలుసుకోవచ్చు. కాగా, జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ (JNTUH) ఈ పరీక్షలను మే 29 నుంచి జూన్‌ 1 వరకు నిర్వహించింది. ఈ ప్రవేశ పరీక్షలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు కనీసం 30 మార్కులు (మొత్తం 120 మార్కులకు గానూ) సాధిస్తే కౌన్సెలింగ్‌కు అర్హత పొందుతారు. అర్హత సాధించిన అభ్యర్థులకు జూలై , ఆగస్టు నెలల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కావొచ్చని తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>