Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద హై టెన్ష‌న్‌!

క‌లం, వెబ్ డెస్క్: తెలంగాణ సెక్ర‌టేరియ‌ట్ (Telangana Secretariat) వ‌ద్ద తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. ఫీజు రీయింర్స్ మెంట్‌ (Fee Reimbursement)పై రాష్ట్ర ప్ర‌భుత్వ వైఖ‌రికి నిర‌స‌న‌గా బీసీ సంఘాలు సెక్ర‌టేరియ‌ట్ ముట్ట‌డికి య‌త్నించాయి. ఈ కార్య‌క్ర‌మానికి బీసీ సంఘాల నాయ‌కులు, విద్యార్థులు భారీ ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు రంగంలోకి దిగారు. ఇప్ప‌టికే ప‌లువురు బీసీ సంఘాల నాయ‌కుల‌ను అరెస్ట్ చేశారు. బలవంతంగా వాహనాల్లోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు.

అరెస్టుల‌పై నాయ‌కులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వం పేద విద్యార్థుల చ‌దువుల ప‌ట్ల తీవ్ర నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంద‌ని, త‌క్ష‌ణ‌మే ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ (Fee Reimbursement) పెండింగ్ బ‌కాయిల‌ను విడుద‌ల చేయాల‌ని డిమాండ్ చేశారు. పోలీసులు, నాయ‌కుల‌కు మ‌ధ్య జ‌రిగిన వాగ్వాదంతో సెక్ర‌టేరియ‌ట్ వ‌ద్ద‌ తీవ్ర ఉద్రిక్త ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>