పెద్దూరు ప్రభుత్వ గోదాంలో ధాన్యం మాయం.. పోలీసుల దర్యాప్తు

కలం, కరీంనగర్ బ్యూరో: రాజన్న సిరిసిల్ల (Rajanna Sircilla) జిల్లా పెద్దూరు అపెరల్ పార్క్ (Apparel Park) సమీపంలోని ప్రభుత్వ గోదాంలో ధాన్యం మాయమైంది. ఈ మేరకు స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు గోదాం నుంచి ధాన్యపు బస్తాలతో తరలిస్తున్న లారీని పట్టుకున్నారు. లారీలో ప్రాథమిక సమాచారం మేరకు సుమారు 200 ధాన్యం బస్తాలు ఉన్నాయి.

అకాల వర్షాల కారణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయంగా అప్పారావ్ పార్క్ గోదాంలో దాదాపు 3 లక్షల 30 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వ చేసింది. కాగా కొన్ని రోజులుగా ఈ గోదాం నుంచి వందలాది బస్తాలు మాయం అవుతున్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గోదాంలో నిల్వ ఉంచిన ధాన్యం బస్తాలు, ఇతర స్టాక్ రిజిస్టర్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే గోదాంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో భద్రతా చర్యలు నిరంతర పర్యవేక్షణ లేవనే ప్రశ్నలు సర్వత్ర వినిపిస్తున్నాయి.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>