Mobile Popup Ad
Mobile Popup Ad

భూమిపై మోస్ట్ సీనియర్ సిటిజన్.. ఈ తాబేలే!

కలం, వెబ్ డెస్క్ : ప్రపంచంలోనే అత్యంత వృద్ధ జీవిగా గుర్తింపు పొందిన ‘జోనాథన్’ అనే తాబేలు (Jonathan Tortoise)ను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారికంగా తమ ఐకాన్‌గా ప్రకటించింది. సెషెల్స్ జెయింట్ జాతికి చెందిన ఈ తాబేళ్ల సగటు ఆయుర్దాయం సాధారణంగా 150 ఏళ్లు మాత్రమే ఉంటుంది. అయితే, అన్ని అంచనాలను తలకిందులు చేస్తూ జోనాథన్ ప్రస్తుతం 194వ ఏట అడుగుపెట్టి అరుదైన మైలురాయిని అందుకుంది.

సుమారు 1832లో జన్మించినట్లు భావిస్తున్న ఈ తాబేలు, ప్రస్తుతం భూమిపై జీవించి ఉన్న అత్యంత పురాతన జంతువుగా సరికొత్త రికార్డును సృష్టించింది. రెండు శతాబ్దాల కాలంలో ప్రపంచంలో వచ్చిన ఎన్నో చారిత్రక మార్పులను చూసిన ఈ తాబేలు, ఇప్పుడు గిన్నిస్ రికార్డుల ప్రతిష్ఠాత్మక ఐకాన్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

Read Also: లొకేషన్ ముఖ్యం కాదు, ఫీలింగ్ ముఖ్యం.. జెన్‌జీ ‘ట్రావెల్‌’ ట్రెండ్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>