కేటీఆర్ పోటీపై సవాల్.. వరంగల్ పశ్చిమలో అట్టుడికిన రాజకీయం!

కలం, వరంగల్‌ బ్యూరో: వరంగల్ పశ్చిమ నియోజవర్గం (Warangal West) పొలిటికల్ గా హీటెక్కింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ రాజకీయ సవాళ్లు కాస్తా రోడ్డెక్కాయి. కేటీఆర్‌ పర్యటన అనంతరం ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌ భాస్కర్‌ మధ్య మొదలైన సవాళ్లు.. ప్రతి సవాళ్లు ఇరు పార్టీల శ్రేణుల మధ్య రాజకీయ వేడిని రాజేశాయి. అది కాస్త ఇరు పార్టీల మధ్య ప్రత్యక్ష ఆందోళనకు దారితీసింది. ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు ముట్టడికి బీఆర్‌ఎస్‌ శ్రేణులు ప్రయత్నించా యి. బైఠాయించి నినాదాలు చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయగా ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ శ్రేణులు కూడా ప్రతి ఆందోళనకు రెడీ అయ్యాయనే ప్రచారంతో మరింత ఉద్రిక్తత తలెత్తింది.

నాయిని సవాల్‌.. వినయ్‌ ప్రతి సవాల్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వరంగల్‌ పశ్చిమ (Warangal West) నుంచి పోటీ చేయాలని ఎమ్మెల్యే నాయిని సవాల్‌ విసిరారు. దీనిపై స్పందించిన మాజీ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ (Vinay Bhaskar) రాజీనామా చేసి ఎన్నికలకు రావాలని నాయికి ప్రతి సవాల్‌ విసిరారు. తాను పోటీకి సిద్ధమని నాయిని సోమవారం సాయంత్రం హనుమకొండ చౌరస్తాకు రావాలని వినయ్ సూచించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో జరిగిన అభివృద్ధి, మూడేళ్ల కాంగ్రెస్‌ పాలన పనులపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఇవే ఇరుపార్టీల మధ్య వివాదానికి కేంద్రబిందువుగా నిలిచాయి.

ప్రతిదాడికి కాంగ్రెస్‌ సమాయత్తం?

కాంగ్రెస్‌ శ్రేణుల ప్రతిస్పందనపై ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. బీఆర్‌ఎస్‌ నిరసనకు కౌంటర్‌గా ధర్నాకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదే జరిగితే రెండు పార్టీల మధ్య రాజకీయ ఆధిపత్య పోరు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశముంది. అభివృద్ధిపై చర్చకు విసిరిన సవాళ్లు చివరకు క్యాంపు ఆఫీసు ముట్టడి, పోలీసుల లాఠీచార్జి వరకు దారితీసింది. ప్రస్తుతం పశ్చిమలో నెలకొన్న రాజకీయ పరిణామాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Also Read : మహేశ్ ఒక్క కామెంట్.. చిన్నారి రీల్‌కు 26 మిలియన్ వ్యూస్!

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>