అల్మాస్ పేటలో హైటెన్షన్: ఇరు వర్గాల మధ్య ఘర్షణ

కలం, వెబ్‌ డెస్క్‌ : కడప నగరంలోని అల్మాస్ పేట కూడలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అల్మాస్ పేట సర్కిల్ (Almaspet Circle) వద్ద హనుమాన్ సర్కిల్ అని రాసి ఉన్న బ్యానర్లను ఏర్పాటు చేయడంపై వివాదం రాజుకుంది. ఈ విషయంపై ఒక వర్గం నాయకులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ ఘర్షణను అదుపు చేయడానికి ప్రయత్నించిన పోలీసులపైకి కూడా రాళ్లు దూసుకొచ్చాయి. ఈ క్రమంలో రాళ్లు తగిలి ఒక ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. నిరసనకారులను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>