Mobile Popup Ad
Mobile Popup Ad

సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఉద్రిక్తత

కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా వ్యాప్తంగా మూడో రోజు సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు శాంతియుతంగా ఆందోళన చేస్తున్నారు. సంగారెడ్డి కొత్త బస్టాండ్ వద్ద ఆర్టీసీ కార్మికులు కూర్చోవడానికి వేసుకున్న కార్పెట్లను పోలీసులు తొలగించారు. అంతేకాకుండా ఆర్టీసీ కార్మికులకు టెంట్ హౌస్ సామగ్రి ఇచ్చిన యజమానిని, టెంట్ సామాగ్రి ఇవ్వవద్దని పోలీసులు హెచ్చరించారు. దీంతో పోలీసులు,ఆర్టీసీ కార్మికుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అత్యుత్సాహం ప్రదరిస్తున్నారంటూ ఆర్టీసి డిపో ఎదుట ధర్నా చేయడానికి కార్మికులు ప్రయత్నించారు. కార్మికులను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే పోలీసులు రెచ్చగొడుతున్నారని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా సమ్మెను కొనసాగిస్తామని ఆర్టీసీ కార్మికులు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>