Mobile Popup Ad
Mobile Popup Ad

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ బంద్‌కు పిలుపునిచ్చిన ఆర్టీసీ జేఏసీ

క‌లం వెబ్ డెస్క్: డ్రైవ‌ర్ శంక‌ర్ గౌడ్ మృతితో ఆర్టీసీ జేఏసీ నేడు ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ జిల్లా బంద్‌ (Warangal Bandh)కు పిలుపునిచ్చింది. కొద్దిసేప‌టి క్రితం ఆర్టీసీ జేఏసీ అత్య‌వ‌స‌ర స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా జేఏసీ నేత‌లు బంద్‌కు పిలుపునిచ్చారు. అంత‌కు ముందే న‌ర్సంపేట బంద్ ప్ర‌క‌టించారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. బ‌స్ డిపోల ముందు భారీ ఎత్తున పోలీసు బ‌ల‌గాలు మోహ‌రించాయి. ఇప్ప‌టికే ప్ర‌జ‌లు బ‌స్సులు లేక ఇబ్బందులు ప‌డుతున్న నేప‌థ్యంలో ఎలాంటి అవాంఛ‌నీయ సంఘ‌ట‌న‌లు జ‌రుగ‌కుండా పోలీసులు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. మ‌రోవైపు శంక‌ర్ గౌడ్ అంత్య‌క్రియ‌ల‌కు ఆర్టీసీ కార్మికుల‌తో పాటు ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>