తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో ముగిసిన కీలక సమావేశం

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ లో తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌లో (Telugu Film Chamber) కీలక సమావేశం ముగిసింది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లతో ఫిల్మ్‌ ఛాంబర్‌ చర్చలు జరిపింది.ఈ సమావేశంలో ప్రధానంగా ఎగ్జిబిటర్ల సెక్టార్‌కు సంబంధించిన ‘పర్సంటేజీ విధానం’పై చర్చించారు. సమస్య వేగంగా, సామరస్యంగా పరిష్కరించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్సంటేజీల వ్యవహారాన్ని తేల్చేందుకు ప్రత్యేకంగా సబ్‌-కమిటీ ఏర్పాటు చేశారు. సబ్‌కమిటీ చైర్మన్‌గా డి.సురేష్‌బాబు, కన్వీనర్లుగా అల్లు అరవింద్‌, దిల్‌ రాజు. కే.ఎల్ నారాయణ, కె. అశోక్‌ కుమార్‌ ఉన్నారు. సబ్‌ కమిటీలో నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లకు సమాన ప్రాధాన్యం కల్పించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>