పార్టీలకతీతంగా సీఎం రిలీఫ్ ఫండ్: యెన్నం

కలం, మహబూబ్ నగర్ బ్యూరో: పార్టీలకతీతంగా అర్హులైన పేదలందరికీ సీఎం రిలీఫ్ ఫండ్ (CM Relief Fund)  నిధులు అందజేస్తున్నామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.  ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్, హన్వాడ మండలాలకు చెందిన 40 మంది లబ్ధిదారులకు ఆయన సీఎం  రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం చేయించుకొన్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్‌లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు సహాయం అందించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

అన్ని డాక్యుమెంట్లు సమర్పించి సాయం పొందండి

అర్హులైన లబ్ధిదారులు తమ వైద్యానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు (బిల్లులు, మెడికల్ రిపోర్టులు) మా కార్యాలయంలో సమర్పించాలని సూచించారు. సమర్పించిన పత్రాలను పరిశీలించి, ప్రాసెస్ చేసి, ప్రభుత్వానికి (సెక్రటేరియట్) పంపించి వారికి ఆర్థిక సహాయం అందించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ కార్యక్రమం ద్వారా కొన్ని వేలమంది లబ్ధి పొందగా, మరింత మంది ప్రజలకు ఉపయోగపడేలా విస్తరిస్తున్నామని చెప్పారు.

పేదలకు ఏ లోటూ లేకుండా సాయం

క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేకంగా నలుగురు సిబ్బంది సీఎం రిలీఫ్ ఫండ్ కోసమే పనిచేస్తున్నారని, అదనంగా హైదరాబాద్‌లో కూడా సహాయం కోసం ఇద్దరు పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మీ పరిసరాల్లో ప్రైవేట్ హాస్పిటల్స్‌లో వైద్యం పొందుతున్న పేద కుటుంబాల వివరాలు, డాక్యుమెంట్లు సేకరించి మా కార్యాలయంలో అందించాలని సూచించారు. పేదలకు వైద్య సహాయం అందించడంలో ఎలాంటి లోటు లేకుండా ప్రతి ఒక్కరికీ అండగా నిలబడటం మా లక్ష్యం అని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నరసింహారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వినోద్ కుమార్, సిరాజ్ ఖాద్రీ, నాయకులు సుధాకర్ రెడ్డి, చెన్నయ్య, మోహన్ రెడ్డి, ధర్మాపూర్ నర్సింహారెడ్డి, అబ్దుల్ హక్, గోవింద్ యాదవ్, చంద్రమౌళి, కేశవులు వివిధ గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>