Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో నిలిచిపోయిన వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్లు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ వ్యాప్తంగా వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచిపోయింది. వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ (Permanent Registration) కోసం ఆర్‌టీఓ (RTO) కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా డీలర్లు షోరూమ్‌లోనే వాహనదారుడికి దాన్ని ఇచ్చేలా ఇటీవల “వాహన్” పోర్టల్ (Vahan Portal) సాఫ్ట్ వేర్ ను రాష్ట్రంలో అమలు చేశారు. కానీ ఇప్పుడు ఆ పోర్టల్ తోనే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాహనాల పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం అప్లికేషన్లు పెట్టిన 20 రోజులుగా నెంబర్లు జనరేట్ కావడం లేదు.

దీంతో వాహనాదారులు టోల్ ప్రీ నెంబర్ కు ఫోన్ చేస్తే ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదు. మీకు సంబంధించిన రవాణా శాఖ కార్యాలయంకు వెళ్లండి అంటూ వారు ఉచిత సలహా ఇవ్వడం కొసమెరుపు . అటు రవాణాశాఖ అధికారులను అడిగితే మాకు తెలియదంటూ వారు చేతులు ఎత్తేస్తున్న వైనం కనిపిస్తోంది. తమకు పోర్ట్ సాఫ్ట్ వేర్ పై అవగాహన లేదంటూ చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పటికే స్పెషల్ నెంబర్ కోసం నాలుగు, ఐదు సార్లు డబ్బులు కట్టిన వాహనాదారులు ప్రస్తుతం హైరానా పడుతున్నారు. స్పెషల్ నెంబర్లు ఎలాట్ కాకపోగా.. డబ్బులు రిఫండ్ కావడం లేదు. మీ సేవా టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే రెస్పాన్స్ రావడం లేదు. మీ సేవా, రవాణా శాఖ కార్యాలయాలకు చక్కర్లు కొడుతున్న ఎవరూ సరైన సమాధానం చెప్పడం లేదు. దీంతో అటు నెంబర్ ఎలాట్ కాకా.. ఇటు కట్టిన డబ్బులు తిరిగి రాక సదరు వాహనాదారులు అయోమయంలో ఉన్నారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.

రవాణా సేవలు సులభతరం చేయడానికి కొత్తగా అమలులోకి తెచ్చిన “వాహన్” పోర్టల్ ప్రస్తుతం సమస్యల వలయంలో చిక్కుకుంది. “వాహన్” పోర్టల్ సాంకేతిక సమస్యలను తీర్చడంలో రవాణాశాఖ అధికారులు విఫలమవుతున్నారు. గత కొన్ని రోజులుగా ట్రాన్స్ పోర్టు తాత్కాలిక రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోవడంతో భారీగా వాహనదారులు షోరూమ్ వద్దకు చేరి ఫిర్యాదులు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ లో అనేక సమస్యలు రావడంతో షోరూమ్ సిబ్బంది తంటాలు పడుతున్నారు. సమస్యను వెంటనే తీర్చాలని వాహనదారుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. సమస్య ఎలా తీర్చేది అని తలలు పట్టుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>