మొండి బకాయిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్

కలం, నేషనల్ బ్యూరో : కూర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని ప్రభుత్వ ఆఫీసుల మొండి బకాయిల వసూలుకు పట్టణాభివృద్ధి శాఖ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దీర్ఘకాలంగా పేరుకుపోయిన బిల్లులపై వడ్డీని, పెనాల్టీని పూర్తిగా మాఫీ చేసి ఒరిజినల్‌గా బిల్లు మొత్తాన్ని మాత్రమే వసూలు చేయాలని భావిస్తున్నది. పూర్వ జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల మొండి బకాయిలను మున్సిపల్ కార్పొరేషన్స్, జలమండలి క్రోడీకరించాయి. వడ్డీ, పెనాల్టీతో కలిపి మొత్తం రూ. 5,865 కోట్ల మేర బాకీ ఉన్నట్లు తేలింది. ఇందులో వడ్డీని, పెనాల్టీని తీసేస్తే రూ. 1,686 కోట్లను చెల్లిస్తే సరిపోతుందని ఎంఏయూడీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీచేశారు. కొత్తగా ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలోనే దాదాపు రూ. 5,612 కోట్ల బకాయిలు (వడ్డీ, పెనాల్టీ కలిపి) ఉన్నాయని, ఇందులో ఒరిజినల్ బిల్లుకు సంబంధించిన రూ. 1,585 కోట్లు చెల్లిస్తే సరిపోతుందని పేర్కొన్నారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 52.75 కోట్లకుగాను రూ. 24.87 కోట్లు, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 200 కోట్లకుగాను రూ. 76 కోట్లు చెల్లిస్తే సిరిపోతుందని తెలిపారు. ‘వన్ టైమ్ సెటిల్‌మెంట్’ విధానంతో మొత్తంగా ప్రభుత్వానికి రూ. 1,686 కోట్లు వసూలవుతాయని అంచనా.

క్యూర్ పరిధిలో ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు అవసరమైన ఆర్థిక వనరులను ఈ రూపంలో ప్రభుత్వం సమకూర్చుకుంటున్నది. ప్రైవేటు భవనాల యజమానుల నుంచి బకాయిలే లేకుండా కఠినంగా వ్యవహరించే ప్రభుత్వం ఏండ్ల తరబడి సొంత ఆఫీసుల బకాయిలనే వసూలు చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి దయనీయంగా మారడం, నగర విస్తరణతో ప్రజలకు సేవలందించడానికి ఎదురయ్యే ఇబ్బందులతో ఒకేసారి రూ. 1700 కోట్లు వచ్చినా చాలనే అభిప్రాయానికి వచ్చింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>