బుద్ధవనంలో సాంస్కృతిక కార్యక్రమాలు

కలం, నాగార్జునసాగర్ : తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో నాగార్జునసాగర్ లో బుద్ధవనం (Buddhavanam) ప్రాంగణంలో శనివారం పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో పర్యాటకులను ఆహ్లాదపరచడానికి తెలంగాణ టూరిజం, తెలంగాణ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

దీనిలో భాగంగా శనివారం బుద్ధవనం ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలలో దేవరకొండకు చెందిన బంజారా నృత్య కళాకారులు, నల్లగొండకు చెందిన రమేష్ బృందం ఆధ్వర్యంలో జానపద కళాకారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు సందర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో బుద్దవనం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన, ఎస్టేట్ ఆఫీసర్ రవిచంద్ర, విజయ విహార్ మేనేజర్ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>