కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ టెట్ 2026 ఫలితాలు (TET 2026 Results) విడుదలయ్యాయి. మొత్తం 1,00,270 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఫలితాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచిన తెలంగాణ ఉన్నత విద్యామండలి. టెట్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 2,37,754 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా 1,95,181 (82.09 శాతం) మంది హాజరయ్యారు. జనవరి 3 నుంచి 20 వరకు పరీక్షలు జరగగా.. ఇటీవల ప్రైమరీ కీ విడుదల చేశారు. ఫిబ్రవరి 1 వరకు అభ్యర్థుల నుంచి ఉన్నత విద్యామండలి అభ్యంతరాలు స్వీకరించింది. ఫిబ్రవరి 10 నుంచి 13 వరకు ఫలితాలు విడుదలవుతాయని ముందుగానే ప్రకటించింది.


