కలం, వెబ్ డెస్క్: ఢిల్లీలో ఇటీవల చేపట్టిన నిరసనలపై బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ (Kangana Ranaut) స్పందించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని, ఆయన తల్లిని ఆందోళనకారులు ఇష్టమొచ్చినట్లు బూతులు తిట్టారని ఫైర్ అయ్యారు. అసలు వీళ్లు విద్యార్థులేనా.. నిజంగా అలా పిలవగలమా.. అని ప్రశ్నించారు. ఇది ఏమాత్రం సమంజసం కాదన్నారు. ఆందోళనల్లో ఇలాగే వ్యవహరిస్తారా.. అని ధ్వజమెత్తారు.
ఇదే మొదటిసారి చూస్తున్నా..
తాము 16వ ఏట నుంచే కెరీర్ నిర్మించుకుంటున్నామని అనేక ఆందోళనల్లో పాల్గొన్నామని కంగనా రనౌత్ (Kangana Ranaut) అన్నారు. కానీ, ఇలాంటి అసభ్యకర భాషను ఉపయోగించడం ఇదే మొదటిసారిగా చూస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలు కూడా ఇలాంటి నీచమైన భాష మాట్లాడుతుంటే వాళ్ల తల్లిదండ్రులకు ఎలా అనిపిస్తుంటుంది. భవిష్యత్తులో కోర్ట్ కేసులు ఎదుర్కొంటే.. అందుకయ్యే ఖర్చును భరించుకోగలరా.. అని ఆందోళనకారులను ఉద్దేశించి అన్నారు.
Read Also: కేంద్రంపై యువతలో తీవ్ర వ్యతిరేకత: కేటీఆర్
Follow Us On: Sharechat

