Mobile Popup Ad
Mobile Popup Ad

పదో తరగతి ఫలితాలు వచ్చేశాయి.. వాట్సాప్‌లోనే రిజల్ట్స్!

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ పదో తరగతి ఫలితాలు (Telangana SSC Results) కొద్దిసేపటి క్రితమే విడుదలయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు మొత్తం 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు. 95.15 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఈసారి ఫలితాల వెల్లడిలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. కేవలం గ్రేడ్లు మాత్రమే కాకుండా విద్యార్థులకు సబ్జెక్టుల వారీగా మార్కులను కూడా వెల్లడించారు. అలాగే విద్యార్థుల సౌకర్యార్థం తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలను పొందే వెసులుబాటు కల్పించారు. విద్యార్థులు 80969 58096 అనే వాట్సాప్ నెంబరుకు ‘Hi’ అని మెసేజ్ పంపి తమ ఫలితాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఫలితాలు అధికారిక వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో ఉన్నాయి.

ములుగు జిల్లా ఫస్ట్

పదో తరగతి (SSC) ఫలితాల్లో ములుగు (Mulugu) జిల్లా 99.30 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. మొత్తం 5,16,815 మంది రెగ్యులర్ అభ్యర్థులు పరీక్షలకు హాజరుకాగా, అందులో 4,91,774 మంది ఉత్తీర్ణత సాధించారు. రాష్ట్ర సగటు ఉత్తీర్ణత శాతం 95.15 శాతంగా నమోదైంది. జిల్లాల వారీగా పరిశీలిస్తే, ములుగు తర్వాత స్థానాల్లో నాగర్ కర్నూల్ (99.03శాతం), నిర్మల్ (98.96 శాతం) జిల్లాలు నిలిచాయి. అత్యల్పంగా హైదరాబాద్ జిల్లా 89.23 శాతం ఉత్తీర్ణతతో జాబితాలో చివరి స్థానంలో నిలిచింది. వికారాబాద్ (91.25శాతం), భద్రాద్రి కొత్తగూడెం (90.58శాతం) జిల్లాలు కూడా రాష్ట్ర సగటు కంటే తక్కువ ఫలితాలను నమోదు చేశాయి.

బాలికలదే పైచేయి

ఈ ఏడాది ఫలితాల్లో (Telangana SSC Results) కూడా బాలికలు బాలుర కంటే మెరుగైన ప్రతిభ కనబరిచారు. రాష్ట్రవ్యాప్తంగా 96.26 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించగా, బాలుర ఉత్తీర్ణత శాతం 94.07 శాతంగా ఉంది. బాలుర కంటే బాలికలు 2.19 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇలాగే ఉంది. ఉదాహరణకు, ములుగు జిల్లాలో 99.56 శాతం బాలికలు ఉత్తీర్ణులవ్వగా, బాలురు 99.06 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్ జిల్లాలో సైతం బాలురు 86.95 శాతం మంది ఉత్తీర్ణులైతే, బాలికలు 91.4 శాతం మంది ఉత్తీర్ణత సాధించి తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>