హైదరాబాద్ శివార్లలో హస్కీ డాగ్స్.. అసలేం జరిగింది?

కలం, వెబ్‌ డెస్క్ : హైదరాబాద్ శివారు శంకర్పల్లి నుంచి పటాన్‌చెరు వెళ్లే దారిలో మంగళవారం సాయంత్రం సుమారు 40 సైబీరియన్ హస్కీ జాతి కుక్కల (Husky Dogs)ను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. ఒక ట్రక్కులో ఈ మూగజీవాలను తీసుకువచ్చి నిర్మానుష్య ప్రాంతంలో దించేసినట్లు స్థానికులు గమనించారు. సమాచారం అందుకున్న ఆసరా ఫౌండేషన్ ప్రతినిధులు వెంటనే అక్కడికి చేరుకున్నారు.
ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే ఒక హస్కీ మృతి చెంది కుళ్ళిపోయిన స్థితిలో కనిపించింది. మిగిలిన వాటి కోసం గాలింపు చేపట్టగా ప్రస్తుతం ఆరు కుక్కలను సురక్షితంగా రక్షించి చికిత్స నిమిత్తం తరలించారు. ఎండ తీవ్రత అధికంగా ఉండటం, తగిన ఆహారం లేకపోవడంతో మిగిలిన కుక్కల పరిస్థితి ఆందోళనకరంగా మారింది. విదేశీ వాతావరణంలో పెరిగే ఈ హస్కీలను ఇలా రోడ్డు పక్కన వదిలేయడంపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>