Mobile Popup Ad
Mobile Popup Ad

పీసీబీ నిషేధంపై స్పందించిన ముజారబానీ ఏజెంట్

కలం, వెబ్ డెస్క్ :  పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) విధించిన రెండేళ్ల నిషేధంపై జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ బ్లెస్సింగ్ ముజారబానీ (Blessing Muzarabani) ఎట్టకేలకు స్పందించారు. తన క్లయింట్‌పై పీసీబీ తీసుకున్న చర్యను తప్పుబడుతూ ముజారబానీ ఏజెంట్ రాబ్ హంఫ్రీస్ వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 13న పీఎస్ఎల్ 11వ సీజన్ కోసం ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టు ముజారబానీని సంప్రదించినట్లు సమాచారం. సుమారు 1.1 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం కుదిరినట్లు వార్తలు వెలువడ్డాయి. అయితే జింబాబ్వే క్రికెట్ బోర్డు నుండి అనుమతి పత్రం (NOC) రావడంపైనే ఈ ఒప్పందం ఆధారపడి ఉంటుందని తొలుత నిర్ణయించారు.

ఇస్లామాబాద్ యునైటెడ్ అప్పట్లోనే సోషల్ మీడియాలో ముజారబానీ ఒప్పందాన్ని ప్రకటించినప్పటికీ, ఫిబ్రవరి 27 వరకు కూడా ఆయనకు అధికారిక కాంట్రాక్ట్ పత్రాలు అందలేదు. ఇదే సమయంలో ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) నుండి ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో ఆడేందుకు ఆయన కేకేఆర్‌తో ఒప్పందం చేసుకున్నారు. దీంతో పీఎస్ఎల్ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఐపీఎల్‌కు వెళ్లారని ఆరోపిస్తూ పీసీబీ ఏప్రిల్ 14న ముజారబానీపై రెండేళ్ల నిషేధం విధించింది.

ఈ వివాదంపై స్పందించిన ముజారబానీ ఏజెంట్ రాబ్ హంఫ్రీస్, పీసీబీతో ఎటువంటి బైండింగ్ అగ్రిమెంట్ జరగలేదని స్పష్టం చేశారు. ఆరు వారాలుగా తాము మౌనంగా ఉన్నామని, బోర్డుతో వివాదం సృష్టించడం తమ ఉద్దేశం కాదని తెలిపారు. అధికారిక ఒప్పందం అందకపోవడంతోనే ఐపీఎల్ ఆఫర్‌ను స్వీకరించాల్సి వచ్చిందని ఆయన వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>