కలం, వెబ్ డెస్క్ : రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు (Telangana Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వర్షాల ప్రభావంతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే వీలుంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించారు. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడవచ్చు. ముఖ్యంగా నేడు భూపాలపల్లి, ములుగు, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మార్పుతో ఎండల తీవ్రత నుండి ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.

