ముంబైకి మయాంక్ మార్కండే కీలకం: ఇర్ఫాన్

కలం, స్పోర్ట్స్: ఐపీఎల్ (IPL) 2026 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్ జట్టుపై ఆసక్తికర విశ్లేషణ బయటకొచ్చింది. మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) జట్టు బలాబలాలను వివరించారు. మొదటగా, మయాంక్ మార్ఖండే (Mayank Markande) పాత్రపై ఆయన దృష్టి సారించారు. గతంలో ముంబై ఇండియన్స్‌తో కెరీర్ ప్రారంభించిన మార్కండేను మళ్లీ జట్టులోకి తీసుకురావడం కీలక నిర్ణయమని చెప్పారు. అతని బౌలింగ్‌లో మెరుగుదల కనిపిస్తోందని, పూర్తి స్థాయి స్పిన్నర్‌గా మారుతున్నట్లు అభిప్రాయపడ్డారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్ల పాత్ర ఎంతో ముఖ్యమని ఆయన వివరించారు. మార్కండే తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తిస్తే జట్టులో బలహీనతలు ఉండవని సూచించారు. రెండు ఎండ్ల నుంచి స్పిన్నర్లు ఒత్తిడి పెడితే అది మ్యాచ్‌పై ప్రభావం చూపుతుందని చెప్పారు.

ఇక పేస్ విభాగంలో దీపక్ చాహర్‌పై (Deepak Chahar) ఆందోళన వ్యక్తం చేశారు. గత సీజన్‌లో అతని ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదని గుర్తుచేశారు. మ్యాచ్‌కు ఒక వికెట్ కూడా తీసుకోలేకపోయిన సందర్భాలు ఉన్నాయని, ఎకానమీ రేటు కూడా ఎక్కువగానే ఉందని పేర్కొన్నారు. చాహర్ ఫిట్‌నెస్ కూడా జట్టుకు కీలకమని ఆయన (Irfan Pathan) చెప్పారు. గతంలో ఫిట్‌నెస్ సమస్యలు ఉండటంతో ఈ అంశం ఎప్పుడూ పర్యవేక్షణలోనే ఉంటుందని వివరించారు.

కొత్త బంతితో వికెట్లు తీసే సామర్థ్యం చాహర్‌కు కీలకమని చెప్పారు. ట్రెంట్ బోల్ట్‌తో కలిసి పవర్‌ప్లేలో వికెట్లు పడగొట్టగలిగితే జట్టుకు పెద్ద ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు. పవర్‌ప్లేలో వరుసగా ఓవర్లు వేయగలిగే సామర్థ్యం చాహర్‌కు ఉన్నా, స్థిరమైన ఫామ్‌లో ఉండటం చాలా ముఖ్యం అని సూచించారు. ఐపీఎల్ మధ్యలో ఎక్కువ క్రికెట్ ఆడకపోవడం అతనికి సవాల్‌గా మారొచ్చని తెలిపారు. మొత్తంగా, స్పిన్, పేస్ విభాగాల్లో సమతుల్యత సాధిస్తే ముంబై ఇండియన్స్ బలమైన జట్టుగా మారే అవకాశం ఉందని ఈ విశ్లేషణ సూచిస్తోంది.

Read Also: కాసేపట్లో గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్.. స్పెషల్ అట్రాక్షన్స్ ఇవే

Follow Us On: X(Twitter)

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>