కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) – ఐఐటీఎం పుణే తీపి కబురు అందించింది. ఐఎండి ఐఐటీఎం పుణే సంయుక్తంగా విడుదల చేసిన ఎక్స్‌టెండెడ్ రేంజ్ ఫోర్‌కాస్ట్ ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు వారాల పాటు నైరుతి రుతుపవనాలు (Telangana Monsoon) అనుకూలంగా కొనసాగనున్నాయి. మొదటి వారంలో వర్షపాతం సాధారణం కంటే కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ, ఆ తర్వాత పరిస్థితుల్లో సానుకూల మార్పులు రానున్నాయి.
జూన్ చివరి వారం నుంచి జూలై మధ్య కాలం వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు నమోదవుతాయని ఈ నివేదిక వెల్లడించింది. ఈ సమృద్ధిగా కురిసే వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ కార్యకలాపాలకు ఎంతో అనుకూలమైన పరిస్థితులను కల్పిస్తాయని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.
Read Also: ఉదయాన్నే నిద్రలేవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
Follow Us On: Instagram

