విద్యార్థులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం (Free Bus Travel) కల్పించబోతున్నారు. ఇప్పటికే మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తున్నారు. ఈ పథకం విజయవంతంగా సాగుతోంది. అదే విధంగా విద్యార్థులకు కూడా ఉచిత బస్ ప్రయాణ సౌకర్యం కల్పించబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు.

రేవంత్ శనివారం ఓ ప్రైవేట్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. విద్యార్థులకు ఉచిత బస్ సౌకర్యం (Free Bus Travel) కల్పిస్తామని చెప్పారు. విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకురాబోతున్నట్టు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 12వ తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్, భోజనం పెడుతున్నామని చెప్పారు. అలాగే విద్యార్థులకు ట్యూటర్లను నియమించి మంచి విద్య అందిస్తామన్నారు. రాష్ట్రంలో స్కిల్ వర్సిటీ కూడా తీసుకొచ్చి మెరుగైన నైపుణ్యాలు అందిస్తామన్నారు. భవిష్యత్ లో ఏఐ వచ్చినా బ్లూ కాలర్ జాబ్‌లను రీప్లేస్ చేయలేదని చెప్పారు.

Read Also: బీఆర్ఎస్ అడ్డం పడ్డా అభివృద్ధి ఆగదు : రేవంత్ రెడ్డి

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>