యాదగిరిగుట్టపై తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

కలం, యాదగిరిగుట్ట : తెలంగాణ విమోచన దినోత్సవ, ప్రజా పాలనా దినోత్సవం సందర్భంగా యాదగిరిగుట్ట (Yadagirigutta) శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం వైటీడి కార్యాలయ ప్రాంగణంలో పతాకావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈఓ భవాని శంకర్ జెండా ఆవిష్కరణ అనంతరం జాతీయ పతాకానికి గౌరవ వందనం చేశారు.

ఈ సందర్భంగా ఈఓ భవాని శంకర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రజలు శాంతి, సౌభ్రాతృత్వం, అభివృద్ధి, సుభిక్షతతో మరింతగా వర్ధిల్లాలని, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సుభిక్షంగా ఉండాలని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని ప్రార్థించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే ఉద్దేశంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు.

భక్తుల సౌకర్యాలు, మౌలిక వసతుల అభివృద్ధి, క్షేత్ర అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. దాతలు, భక్తుల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేపట్టి, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి క్షేత్ర విశిష్టతను జాతీయ స్థాయిలో అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. భక్తులు, దాతలు అందిస్తున్న సహాయ సహకారాలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ భాస్కర శర్మ, ప్రధాన అర్చకులు కాండూరి వెంకటాచార్యులు, బి.సురేంద్రాచార్యులు, దేవస్థానం అధికారులు, సిబ్బంది, భద్రతా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>