కలం, నాగార్జునసాగర్ : పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్ (NagarjunaSagar) ను గురువారం నాడు అసిస్టెంట్ ఆడిట్ అధికారులు సందర్శించారు. గ్రూప్ 1 అధికారులుగా తెలంగాణ రాష్ట్రంలో నియామకం అయిన తర్వాత హైదరాబాద్ లోని మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్నారు. టూర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు బెన్నీ జోసఫ్, సాయి ప్రియ ఆధ్వర్యంలో సాగర్ సందర్శనలో భాగంగా బుద్దవనం (Buddhavanam) లోని బుద్ధ చరితవనం, ధ్యానవనం, స్తూప వనాలను సందర్శించి బుద్ధ వనం సమావేశ మందిరంలో బుద్దవనం విశేషాలు తెలియజేసే లఘు చిత్రాన్ని వీక్షించారు. వీరికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శాసన బౌద్ధం ధర్మం గురించి తెలియజేసారు.
అనంతరం మహాస్థూప ధ్యాన మందిరంలో ధ్యానం చేశారు. తరువాత నాగార్జునసాగర్ ప్రధాన డ్యామ్, నాగార్జునకొండ పురావస్తూ మ్యూజియంను సందర్శించారు. వీరికి స్థానిక టూరిజం గైడ్ సత్యనారాయణ నాగార్జునసాగర్ డ్యామ్, నాగార్జునకొండ, బుద్దవనం విశేషాలు వివరించారు. తెలంగాణ రాష్ట్రంలోని అసిస్టెంట్ ఆడిట్ అధికారులు సాగర్ సందర్శన సందర్భంగా నల్లగొండ జిల్లా డిస్టిక్ ఆడిట్ ఆఫీసర్ శ్రీనివాస్ , నందికొండ మున్సిపాలిటీ చైర్ పర్సన్ స్వర్ణ మానస సుమన్ మున్సిపల్ కార్యాలయంలో సమావేశమైనారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ ఆడిట్ అధికారులకు నందికొండ మున్సిపాలిటీ కార్యక్రమాలను వివరించారు. వీరితోపాటు ప్రోటోకాల్ ఆఫీసర్ దండా శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఉన్నారు.

