కలం, మక్తల్: పాండిచ్చేరిలో జరిగిన 37వ సౌత్ జోన్ నేషనల్ ఛాంపియన్ షిప్ అథ్లెటిక్స్ పోటీల్లో మక్తల్ విద్యార్థి రఘుపతి నాయుడు (Raghupathi Naidu) అసమాన ప్రతిభతో జాతీయ స్థాయిలో సత్తా చాటాడు. 14 ఏళ్ల లోపు బాలుర త్రయోతలెన్ విభాగంలో జాతీయ స్థాయిలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం సాధించినట్లు కోచ్ జగదీష్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం మక్తల్ పట్టణంలో రఘుపతి నాయుడును ఘనంగా సన్మానించారు. రఘుపతి నాయుడు ప్రస్తుతం మక్తల్ పట్టణంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల (ఓల్డ్)లో 9వ తరగతి చదువుతున్నాడు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి మక్తల్ ప్రాంతానికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఈ సందర్భంగా కోచ్ జగదీష్ ఆకాంక్షించారు.

