ఎర్రవల్లి భూముల్లో సమగ్ర సర్వే.. రైతులకు కీలక నోటీసులు

కలం, మెదక్ బ్యూరో: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (Erravalli) గ్రామంలోని సర్వే నంబర్ 325 పరిధిలో ఉన్న రైతుల భూముల్లో సోమవారం సమగ్ర సర్వే కొనసాగింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్‌హౌస్ చుట్టూ ఉన్న భూముల సరిహద్దు వివాదం నేపథ్యంలో ఈ సర్వే ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కార్యక్రమాన్ని సర్వే శాఖ AD సుదర్శన్ రాథోడ్, DI శేవ్యా నాయక్ ఆధ్వర్యంలో రెవెన్యూ, సర్వే శాఖల అధికారులు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ మూడు రోజులపాటు నిర్వహించారు. ఈ సర్వే కోసం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, రైతులకు ముందస్తుగా అధికారులు నోటీసులు జారీ చేశారు.

నాలుగు ప్రత్యేక బృందాలతో..

క్షేత్రస్థాయిలో పక్కాగా హద్దులు నిర్ధారించేందుకు అధికారులు నాలుగు ప్రత్యేక బృందాలుగా రంగంలోకి దిగారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ పొలాల వద్దకు చేరుకుని, ప్రభుత్వం గతంలో అందజేసిన పాత పట్టా పాస్ పుస్తకాలు, ఇతర భూ పత్రాలను అధికారులకు సమర్పించారు. ప్రస్తుతం తాము సాగు చేసుకుంటున్న భూముల సరిహద్దుల వివరాలను క్షుణ్ణంగా వివరించారు.

నేటితో 80 మంది భూముల సర్వే పూర్తి

ముందస్తు ప్రణాళికలో భాగంగా అధికారులు శనివారం 100 మంది దళిత రైతులకు నోటీసులు జారీ చేయగా, వారి భూముల్లో సోమవారం సర్వే ప్రారంభించారు. నేటి సర్వేలో భాగంగా సర్వే నంబర్ 325 పరిధిలో 80 మంది రైతులకు సంబంధించిన భూముల్లో హద్దుల నిర్ధారణ పూర్తయినట్లు అధికారులు ప్రకటించారు. మరో 50 మంది రైతులకు అధికారులు సోమవారం కొత్తగా నోటీసులు అందజేశారు. మిగిలిన రైతుల భూముల్లో మంగళవారం సర్వేను కొనసాగించనున్నట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>