ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల: ఈసారీ బాలికలదే పైచేయి!

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు (Inter Supplementary Results) విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లోనూ బాలికలు తమ ఆధిక్యతను చాటుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ పరీక్షల కోసం మొత్తం 3,98,459 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 68.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా, ద్వితీయ సంవత్సరంలో 49.29 శాతం మంది పాసయ్యారు. రెండు సంవత్సరాల ఫలితాల్లోనూ బాలుర కంటే బాలికలే మెరుగైన ప్రతిభ కనబరిచారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 76.10 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 62.57 శాతంతో సరిపెట్టుకున్నారు. అదేవిధంగా ద్వితీయ సంవత్సరంలో బాలికలు 52.56 శాతం ఉత్తీర్ణత నమోదు చేయగా, బాలురు 47.45 శాతం మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా చూస్తే ఈ సప్లిమెంటరీ ఫలితాల్లో బాలికలు స్పష్టమైన పైచేయి సాధించి రికార్డు సృష్టించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>