కలం, వెబ్‌డెస్క్: కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం నేడు ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీలో ఇటీవల జూలై 20న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్ (Delhi Lathi Charge) పై అధికార పక్షాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీలు రణదీప్ సింగ్ సూర్జేవాలా (Randeep Surjewala) , విజయ్ వసంత్ దీనిపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ లాఠీ చార్జ్ ఘటనపై చర్చ చేపట్టాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నిరసనకారులపై జరిగిన చర్యలపై కేంద్రం వివరణ ఇవ్వాలని కోరుతున్నారు.
ఇప్పటికే కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనికి బాధ్యత వహించాలని రాహుల్ గాంధీ బహిరంగ లేఖ రాశారు. కేంద్రం అనుమతి లేకుండానే లాఠీ చార్జ్ జరిగిందా? అని నిలదీశారు. అలాగే లాఠీ చార్జ్ కోసం పోలీసులే కాకుండా ప్రైవేట్ వాలంటీర్లను కూడా నియమించుకున్నారా? అని రాహుల్ అనుమానం వ్యక్తం చేశారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని అమిత్‌షాపై ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also: పార్లమెంట్‌కు ధర్మేంద్ర.. ప్రతిపక్ష ఎంపీల ఆందోళన!
Follow Us On : WhatsApp

