కలం, వరంగల్ బ్యూరో: హనుమకొండ జిల్లాలో ఆత్మకూర్ మండలం పసరగొండ క్రాస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Pasaragonda Road Accident) జరిగింది. డివైడర్ లోని చెట్లకు నీరు పోస్తున్న లారీని, మరో టిప్పర్ అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

