Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో ఐఏఎస్ ల బదిలీలు

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో సీనియర్  ఐఏఎస్ ల (Telangana IAS) బదిలీలు జరిగాయి. ఈ మేరకు 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టింగ్‌లను కేటాయించింది. దీని ప్రకారం.. ఢిల్లీ తెలంగాణ భవన్ స్పెషల్ ఆఫీసర్ గా సంజయ్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఎం.దాన కిషోర్‌ నియామకం అయ్యారు. అలాగే పరిశ్రమల శాఖ స్పెషల్ సెక్రటరీగా కృష్ణ ఆదిత్య బదిలీ అయ్యారు.

హనుమంత్ కొండిబాను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సీఈవోగా, బి. విజయేంద్రను సామాజిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా నియమించారు. హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరిని కార్మిక, ఉపాధి శాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. సంగారెడ్డి కలెక్టర్ ప్రవీణ్యను రోడ్లు & భవనాల శాఖకు ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఐటీ శాఖలో జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.

నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్‌ను ఇంటర్మీడియట్ విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించారు. నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌ సివిల్ సప్లైస్ డైరెక్టర్‌గా నియమాకం కాగా.. జీహెచ్‌ఎంసీ గోల్కొండ జోన్ కమిషనర్‌గా ఉన్న జి. ముకుంద రెడ్డిను సమాచార & పౌర సంబంధాల శాఖ (I&PR)లో స్పెషల్ కమిషనర్‌గా,జీహెచ్‌ఎంసీ కూకట్‌పల్లి జోన్ కమిషనర్‌గా ఉన్న అపూర్వ్ చౌహాన్ను సీసీఎల్ఏ కార్యాలయంలో (CCLA) CMRO ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా నియమించారు. ట్రైబల్ వెల్ఫెర్ స్పెషల్ సెక్రటరీగా సంతోష్ నియమితులయ్యారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>