ఖమ్మం జీజీహెచ్‌ పార్కింగ్ అక్రమ వసూళ్లపై హైకోర్టు సీరియస్!

కలం, ఖమ్మం బ్యూరో : కనీస సౌకర్యాలు కల్పించకుండానే ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి (Khammam GGH)లో రోగులు, వారి బంధువుల నుంచి అక్రమంగా పార్కింగ్ ఫీజులు వసూలు చేయడంపై తెలంగాణ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఈ పార్కింగ్ దందాపై ధ్వజమెత్తిన కోర్టు, ఆస్పత్రి ప్రాంగణంలో తక్షణమే ఎలాంటి పార్కింగ్ రుసుములు వసూలు చేయొద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

​ఖమ్మం జీజీహెచ్‌లో ఎలాంటి మౌలిక వసతులు లేకుండానే కాంట్రాక్టర్లు అధిక మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నారంటూ నవీన్ రాజ్, వజీద్ తదితరులు దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ బి. విజయసేన్ రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున విన్న వాదనలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. అసలు వసతులే లేనప్పుడు ఫీజులు ఎలా వసూలు చేస్తారని నిలదీశారు. ​

ఈ వ్యవహారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఆదేశిస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్, జీజీహెచ్ సూపరింటెండెంట్, మున్సిపల్ కమిషనర్‌లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆస్పత్రికి వచ్చే పేద ప్రజలను పార్కింగ్ పేరిట ఇబ్బందులకు గురిచేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఈ అక్రమ వసూళ్లకు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>