రైతులకు గుడ్‌న్యూస్.. ‘రైతు భరోసా’ పంపిణీకి డేట్ ఫిక్స్

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రైతాంగానికి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఈ నెల 30న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ‘రైతు భరోసా’ (Rythu Bharosa) నిధులను విడుదల చేయనున్నారు. వానకాలం సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఈ డబ్బులు ఉపయోగపడనున్నాయి. ఈ నిధుల విడుదల కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఖమ్మం జిల్లా మధిరలో ప్రభుత్వం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తోంది. ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదును జమ చేయనున్నారు.

గతంలో ఎకరా చొప్పున ప్రభుత్వం రైతు భరోసా (Rythu Bharosa) నిధులను పంపిణీ చేయగా, ఈసారి మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించనుంది. నేరుగా రైతు పేరు మీదుగా నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం తొమ్మిది రోజుల వ్యవధిలో పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. అర్హులైన ప్రతి రైతుకు సాయం అందేలా నిధుల జమ ప్రక్రియను ముగించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.

Read Also: ఎమ్మెల్యేల ప‌నితీరుపై కాంగ్రెస్ సీక్రెట్ సర్వే..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>