కలం, వెబ్ డెస్క్: అయోధ్య (Ayodhya) రామాలయంలో విరాళాల అవకతవకల కేసు విషయంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీనిపై ప్రత్యేకంగా విచారణ చేపట్టిన సిట్ అధికారులు సీసీ టీవీ కెమెరాలు ట్యాంపరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు. సాక్ష్యాలు దొరకకుండా ఉండేందుకు ఇలా ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. విరాళాల లెక్కింపు సందర్భంగా జరిగిన గోల్ మాల్ అంశంపై ఇప్పటివరకు ముగ్గురు అధికారులతో కూడిన సిట్ 200 మంది అనుమానితుల జాబితా తయారు చేసింది. వారిలో 125 మందిని విచారించగా.. తిను యాదవ్ అనే వ్యక్తి వైఖరి అనుమానాస్పదంగా కనిపించడంతో సుదీర్ఘంగా విచారించారు.
డొల్లగా మారిన అంతర్గత భద్రత..
అయోధ్య (Ayodhya) రామాలయానికి దేశ వ్యాప్తంగా కోట్లాది మంది భక్తులతో పాటు విదేశీ ముష్కరుల కన్ను కూడా ఎక్కువగానే ఉంటుంది. అందుకే, ఎన్ఎస్‌జీ వంటి సుశిక్షితులైన కమాండోల పహారాలో ఆలయ భద్రత పర్యవేక్షిస్తున్నారు. బయట భద్రతకు ఢోకా లేకపోయినా.. లోపల అనేక లోపాలున్నట్లు సిట్ విచారణలో తెలుస్తోంది. మరీ ముఖ్యంగా, విరాళాలు, కానుకల లెక్కింపు ప్రదేశంలో భద్రతా ఏర్పాట్లు నాసిరకంగా ఉన్నాయి. ఈ కారణంగానే.. నగదు, ఆభరణాలు బయటకు తీసుకెళ్లినట్లు అనుమానిస్తున్నారు. వారం రోజుల్లో సిట్ ప్రాథమిక నివేదిక ఇవ్వబోతుంది.
Read Also: అమర్‌నాథ్ యాత్రకు వేళాయె.. జమ్మూలో హై అలర్ట్!
Follow Us On : WhatsApp

