కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోతున్న గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ (Gaddar Film Awards) ప్రదానోత్సవ వేడుకకు హైదరాబాద్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ సర్వం సిద్ధమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు. సినీ రంగం నుంచి మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, నాగార్జున, సుహాసిని వంటి దిగ్గజాలతో పాటు యువ నటులు నాగచైతన్య, అఖిల్, రష్మిక మందన్న ఈ వేడుకలో సందడి చేయనున్నారు. వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన విజేతలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా అవార్డులను అందజేసి ఘనంగా సన్మానించనుంది.
ఈ మెగా ఈవెంట్‌కు (Gaddar Film Awards) సుమ కనకాల, ప్రదీప్ మాచిరాజు హోస్ట్‌లుగా అలరించనున్నారు. వేడుకలో భాగంగా నిధి అగర్వాల్ ప్రత్యేక డాన్స్ ప్రదర్శనలు హైలైట్‌గా నిలవనున్నాయి. అలాగే శ్రేయా ఘోషల్, దేవి శ్రీ ప్రసాద్, మంగ్లీల లైవ్ మ్యూజిక్ షోలు ప్రేక్షకులను అలడించనున్నాయి. వీటితోపాటు వనజ ఉదయ్ డాన్స్ గ్రూప్ ప్రదర్శించనున్న సాంస్కృతిక నృత్యాలు రాష్ట్ర వారసత్వాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
Read Also: 58 మందితో పెద్దపల్లి కాంగ్రెస్ జిల్లా కార్యవర్గం
Follow Us On: Facebook

