కలం, వెబ్ డెస్క్ : సంగారెడ్డి (Sangareddy) జిల్లా బృందావనం కాలనీలో ఐదుగురు చిన్నారులను కిడ్నాప్ చేయడానికి దుండగులు ప్రయత్నించిన ఘటన స్థానికంగా భయాందోళన కలిగించింది. ముగ్గురు అనుమానితులు ఆటోలో కాలనీలోకి వచ్చారు. బయట ఆడుకుంటున్న చిన్నారులను గమనించిన వారు పిల్లలని బలవంతంగా ఆటోలో ఎక్కించేందుకు ప్రయత్నించారు.
అయితే, ప్రమాదాన్ని గుర్తించిన పిల్లలు గట్టిగా కేకలు వేయడంతో పరిసరాల్లో ఉన్నవారు అప్రమత్తమయ్యారు. స్థానికులు దగ్గరకు రావడం గమనించిన దుండగులు అక్కడి నుంచి వెంటనే పారిపోయారు. ఈ ఘటనతో కాలనీ ప్రజలు పిల్లల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజ్‌ను పరిశీలిస్తూ దుండగులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. కాలనీలో పహారా పెంచి, అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచారు.
Read Also: డాడీ, మోడీ, చిన్నమోడీపైనే నా పోరాటం.. కవిత కామెంట్స్
Follow Us On: Facebook

