కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఉగాది వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ జాగృతి చీఫ్ కల్వకుంట్ల కవిత (Kavitha) కీలక వ్యాఖ్యలు చేశారు.
డాడీ, మోడీ, చిన్నమోడీపైనే తన పోరాటమని స్పష్టం చేశారు. కొత్త పార్టీ అజెండాపై కసరత్తు జరుగుతుందని.. త్వరలోనే మంచి ముహూర్తం చూసుకుని కొత్త పార్టీ ప్రకటిస్తానని ప్రకటించారు. పార్టీ ప్రారంభించినప్పుడే అజెండా, లక్ష్యాలు ప్రకటిస్తానని స్పష్టం చేశారు. సంకీర్ణ, రెయిన్‌బో రాజకీయాలు తమకు అవసరం లేదన్న కవిత (Kavitha).. భావసారూప్యత కలిగిన వారు, కలిసి వచ్చేవారితో కలిసి కొత్త రాజకీయాలు చేస్తామని చెప్పుకొచ్చారు. పార్టీ కార్యాలయం కోసం అనువైన స్థలాన్ని అన్వేషిస్తున్నామని.. అన్ని జిల్లాల్లో తమ పార్టీ ప్రభావం ఉంటుందన్నారు. యువత, మహిళలు, ఉద్యమంలో పనిచేసిన వారికి తమ పార్టీలో అవకాశం ఇస్తామని పిలుపునిచ్చారు.
ఇదిలాఉంటే బీఆర్ఎస్‌తో తన ఇష్యూను కాంగ్రెస్, చిన్న మోడీ అయిన సీఎం రేవంత్ అడ్వాంటేజ్‌గా తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. పార్టీ ప్రకటనకు ముందే జాతీయ నేతలను కలిసే అంశాన్ని ఆలోచిస్తున్నానని తెలిపారు. మరోవైపు కవిత కొత్త పార్టీ విషయంలో నేడు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించిన సంగతి తెలిసిందే. ఆమె దరఖాస్తు చేసుకున్న రాజకీయ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఈసీకి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఆమె తన కొత్త రాజకీయ పార్టీని పొలిటికిల్ బరిలో నిలిపేందుకు మార్గ సుగమం అయ్యింది.
కాగా, కవిత కొత్త పార్టీ పేరు ” తెలంగాణ ప్రజా జాగృతి ” అని.. పార్టీ గుర్తుగా “ధర్మగంట”ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే కేంద్ర ఎన్నికల కమిషన్‌కు పార్టీ పేరు, గుర్తుతో ఆమె ధరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇప్పుడు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఆమె రాజకీయ పార్టీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో రాజకీయ పార్టీని ఆమోదిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనుంది. దీంతో రానున్న శ్రీరామనవమికి పార్టీని పార్టీ గుర్తును ఆమె అనౌన్స్ చేయనుందనే టాక్ వినిపిస్తోంది.
Read Also: ఖమ్మం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉగాది కానుక
Follow Us On: X(Twitter)

