కామ‌న్వెల్త్ గేమ్స్ విందులో భారత్‌కు అవమానం.. లవ్లీనా ఆగ్రహం!

కలం, వెబ్ డెస్క్ : గ్లాస్గోలో కామన్వెల్త్ గేమ్స్ (Commonwealth Games-2026) విందు వేడుకలో అనూహ్య వివాదం నెలకొంది. భారతీయ రెస్టారెంట్‌లో ఇండియా మ్యాప్ తప్పుగా ముద్రించడంపై భారత భారత బాక్సర్, ఒలింపిక్ పతక విజేత లవ్లీనా బోర్గొహైన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ లో ఉంచిన న్యాప్‌కిన్లు, బయట ప్రదర్శించిన భారత మ్యాప్ లో ఈశాన్య రాష్ట్రాలను చూపించకపోడంపై లవ్లీనా ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, పటంలో జమ్మూ కశ్మీర్ ను కూడా పూర్తి స్థాయిలో చూపలేదని బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ లవ్లీనాకు మద్దతు తెలిపాడు. భారత భౌగోళిక సరిహద్దులను తప్పుగా చూపడం ఆమోదయోగ్యం కాదని పేర్కొంటూ, వెంటనే ఆ మ్యాప్ ను తొలగించి సరైన భారత పటాన్ని ప్రదర్శించాలని నిర్వాహకులను కోరారు.

కాగా, కామన్వెల్త్ లో భారత బాక్సింగ్ జట్లు అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. ఏకంగా ఏడు గోల్డ్ మెడళ్లు సహా పలు పతకాలు సాధించి రికార్డు నెలకొల్పింది. మహిళల 70 కేజీల విభాగంలో లవ్లీనా బోర్గొహైన్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఈ విజయోత్సాహం మధ్య భారత మ్యాప్ వివాదం చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>