తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీ ఏర్పాటు

కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో భూ అక్రమాలను అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భూ అక్రమాలపై విచారణ కమిటీ (Land Investigation Committee)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు జీవో. 134 జారీ చేసింది. అలాగే కమిటీ చైర్మన్ ను సైతం ప్రకటించింది. విచారణ కమిటీ చైర్ పర్సన్ గా ఐఏఎస్ అధికారి దేవసేనను నియమించింది. కమిటీ కన్వీనర్ గా రాజీవ్ గాంధీ హనుమంతు, కమిటీ సభ్యుడిగా జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, సంబంధిత జిల్లాల కలెక్టలను నియమించింది. భూ అక్రమాలు, అవకతవకలు, నిబంధనల ఉల్లంగింపుపై విచారం చేసేందుకే ప్రభుత్వం ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కేవలం 22A భూముల అంశానికి మాత్రమే ఈ కమిటీ పరిమితం కాదని స్పష్టం చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 22A భూ అక్రమాలు తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. 22A నిషేదిత భూముల అంశంతో రైతులు తీవ్రంగా అవస్థలు పడ్డారు. ప్రతి పక్ష బీఆర్ఎస్, బీజీపీ పార్టీలు సైతం రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఒత్తడి తీసుకువచ్చాయి. ఇదే అంశంపై తాజాగా అసెంబ్లీ సమావేశాల్లోనూ సుదీర్ఘంగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాలు. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి దీనిపై స్పందిస్తూ విచారణ కమిటీ వేస్తామని ప్రకటించారు. సీఎం ఆదేశాలతో రెవెన్యూ శాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>