కలం, వెబ్ డెస్క్ : జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. జమ్షెడ్పూర్ నగరంలోని సోనారీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మెరైన్ డ్రైవ్ రోడ్డుపై గురువారం వేకువజామున వేగంగా వెళ్తున్న ఒక కారు, రోడ్డు పక్కన నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది (Jamshedpur Accident). ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మృతుల్లో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి దీపికా పాండే సింగ్ కుమార్తె కూడా ఉన్నట్లు పోలీసులు ధృవీకరించారు. అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఈ విషాద ఘటనపై జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి దీపికా పాండే సింగ్ కుటుంబానికి, మృతుల కుటుంబ సభ్యులకు తన సానుభూతి తెలిపారు. మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.

