బ్యారేజీల రిపేర్లకు కోఆర్డినేషన్ కమిటీ

కలం, వెబ్ డెస్క్: కాళేశ్వరం ప్రాజెక్టులని (Kaleshwaram Barrages) మూడు బ్యారేజీల రిపేర్ పనులు పూర్తి చేసి ఫంక్షనింగ్‌లోకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం (Telangana Govt) ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. వీలైనంత తొందరగా మరమ్మత్తు పనుల్ని కంప్లీట్ చేసి నీటి సరఫరాకు ఇబ్బందులు లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించిన విధంగా బ్యారేజేల ప్రస్తుత పరిస్థితిని అంచనా వేసి అవసరమైన పరీక్షలు నిర్వహించి పునరుద్ధరించడం ప్రధాన లక్ష్యంగా ఈ కమిటీ పనిచేయనున్నది. జియో ఫిజికల్, జియో టెక్నికల్ పరీక్షలను తొందరగా పూర్తి చేస్తే దానికి అనుగుణంగా రిపేర్ పనులు ప్రారంభం కానున్నాయి. వర్షాకాలం ప్రారంభానికంటే ముందే (మే 30 లోగా) ఈ పరీక్షలను, స్టడీలను పూర్తి చేసి నివేదికను రూపొందించాలన్నది ప్రభుత్వం ఉద్దేశం. దీనికి అనుగుణంగానే ప్రతీ రోజు సాయంత్రం ఐదు గంటలకు ప్రోగ్రెస్ రిపోర్టును, ప్రతీ సోమవారం, ప్రతీ గురువారం డీటెయిల్డ్ రిపోర్టులను ప్రభుత్వానికి ఈ కమిటీ సమర్పిస్తుంది.

సమన్వయ కమిటీలోని సభ్యులు వీరే

బ్యారేజీలను (Kaleshwaram Barrages) పునరుద్ధరించేందుకు ఇంజినీర్లు, అధికారులతో పాటు ఆయా రంగాల్లో నిపుణులను కూడా కోఆర్డినేషన్ కమిటీలో సభ్యులుగా నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. మొత్తం తొమ్మిది మందితో కూడిన ఈ కమిటీలో టన్నెల్స్-సేఫ్టీ విభాగం సెక్రటరీ కల్నర్ పరీక్షిత్ మెహ్రా చైర్మన్‌గా ఉంటారు. టెక్నికల్ విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, చీఫ్ ఇంజినీర్ (డిజైన్ ఆర్గనైజేషన్) ఎంఎస్ఎన్ రెడ్డి, పూణెలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చి స్టేషన్ అదనపు డైరెక్టర్ సెల్వ బాలన్, ఆఫ్రీ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఎండీ సాయి కృష్ణ, ఎల్ అండ్ టీ కంపెనీ జనరల్ మేనేజర్ సురేష్ కుమార్, ఆఫ్కాన్స్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున రావు, నవయుగ కంపెనీ ప్రాజెక్టు మేనేజర్ మాధవ్, రామగుండం చీఫ్ ఇంజినీర్ శ్రీనివాసరావు గుప్తా సభ్యులుగా ఉంటారు. డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ అజ్మల్ ఖాన్ ఈ కోఆర్డినేషన్ కమిటీకి మెంబర్ కన్వీనర్‌గా అదనపు బాధ్యతలు చేపడతారు. కమిటీ రూపొందించాల్సన నివేదికల తయారీలో ఆయన సహాయకారిగా వ్యవహరిస్తారు.

Read Also: 15వ ఆర్థిక సంఘం నిధులపై కలెక్టర్ ఆదేశాలు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>