కలం, మెదక్ బ్యూరో : మెదక్ జిల్లాలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి 15వ ఆర్థిక సంఘం నిధులను సమర్థవంతంగా వినియోగించాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ (Collector Pratima Singh) సర్పంచులకు సూచించారు. పంచాయతీరాజ్ చట్టం నిబంధనలకు లోబడి నిధులను సక్రమంగా ఉపయోగించాలని ఆమె స్పష్టం చేశారు. కలెక్టరేట్‌లో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఎంపీఓలు, కంప్యూటర్ ఆపరేటర్లకు 15వ ఆర్థిక సంఘం నిధుల వినియోగంపై వర్క్‌షాప్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ (Collector Pratima Singh) మాట్లాడుతూ.. గ్రామాల అభివృద్ధికి ఈ నిధులు కీలకమని, ప్రతి సర్పంచ్ గ్రామ నాయకుడిగా బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ఈ నిధులను వినియోగించి గ్రామాలను మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పంచాయతీ ప్రత్యేక అధికారులు, కార్యదర్శులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను పరిష్కరించుకోవాలని తెలిపారు. నిధుల వినియోగంలో ఎలాంటి అక్రమాలకు తావులేదని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే సర్పంచులు, కార్యదర్శులపై కఠిన చర్యలు తప్పవని ఆమె స్పష్టం చేశారు.
Read Also: నాకు, ప్రధానికి ఆ సమస్య లేదు: రాహుల్ కామెంట్లతో లోక్‌సభలో నవ్వులు
Follow Us On: Instagram

