భువనగిరిలో డబుల్ బెడ్‌రూం ఇళ్ల పనులపై ఎమ్మెల్యే సమీక్ష

కలం, యాదాద్రి భువనగిరి : యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రజలకు మెరుగైన వసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి (Kumbam Anil Kumar) అన్నారు. శుక్రవారం భువనగిరి పట్టణంలోని సింగన్నగూడెం వద్ద జరుగుతున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రధానంగా పూర్తయ్యాయని, మిగిలిన మౌలిక సదుపాయాల పనులను త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు ఇళ్లను అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇళ్ల పంపిణీకి ముందు అవసరమైన అన్ని సౌకర్యాలు పూర్తిగా సిద్ధంగా ఉండేలా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, ఎక్కడైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇళ్ల పంపిణీ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన (Kumbam Anil Kumar) స్పష్టం చేశారు. ఈ సమీక్ష సమావేశంలో అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read Also: రేవంత్ రెడ్డి ఉద్య‌మ‌కారుల్ని చంపాల‌నుకున్నాడు: బండి సంజ‌య్

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>